Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రపంచంలో ని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తు లే ధరించేలా చే యాలన్నది తమ లక్షమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్ కా న్ఫరెన్స్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టెక్స్‌టైల్స్ మన డిఎన్‌ఏలోనే ఉందన్నారు. తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని సిఎం గుర్తుచేశారు. టెక్స్‌టైల్స్ అనేది మనకు కేవలం ఒక పరిశ్రమ కాదని, అది మ న జీవనాధారమని ఆయన అన్నారు. నిజాం కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారన్నారు.

పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి మన సంస్కృతీలో భాగమని ఆయన అన్నారు. రా ష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సి ఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతూ తెలంగాణను దక్షిణాసి యా టెక్స్‌టైల్స్ రాజధానిగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సిఎం తెలిపారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇక్కడి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరుందని ఆయన పేర్కొన్నారు. లండన్, పారిస్, దుబాయ్ వంటి ఫ్యాషన్ నగరాల్లో తెలంగాణలో తయారైన దుస్తులు మెరవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు.

సినిమా, ఫ్యాషన్, గ్రీన్ టెక్నాలజీ

సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ టెక్స్‌టైల్స్ హబ్’లను అభివృద్ధి చేస్తామని, మహిళలకు అధునాతన డిజైనింగ్, స్టిచింగ్‌లో శిక్షణ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీ దగ్గర విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములమని ఆయన తెలిపారు. భూమి, విద్యుత్, నీరు, వేగవంతమైన అనుమతులతో పాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రండి, కలిసి ఒక కొత్త భవిష్యత్‌ను నిర్మిద్దామని పెట్టుబడిదారులకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఆపిల్ ఇయర్‌ఫాడ్స్ అందిస్తున్న తెలంగాణ

ఇప్పుడు ప్రపంచం ధరించే దుస్తులను కూడా అందించే స్థాయికి చేరుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పత్తిపొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్, ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో తాము అనేక కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని సిఎం అన్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించింద న్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లు ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా ఇందులో చేరిందని ఆయన తెలిపారు. సినిమారంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.