Reading Time: < 1 minute
Sharwanand Biker Movie Lack Of Promotions Affects Openings Box Office

సినిమా బాగుంటే జనం వస్తారు. వాళ్లే ఆదరిస్తారు అనేది పాత మాట. సినిమా బాగుందని జనానికి తెలిసేలా ప్రమోషన్లు చేయాలి.. అనేదే ఇప్పటి ట్రెండ్. తాజాగా విడుదలైన ‘బైకర్’ సినిమా విషయంలో యూనిట్ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకు కావాల్సిన కనీస స్థాయి ప్రమోషన్లను కూడా ఈ టీమ్ నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ గత చిత్రం నారీ నారీ నడుమ మురారి భారీ హిట్ అయింది ఆ సినిమాకి శర్వ ముందు నుంచి మంచి ప్రమోషన్స్ చేశాడు. కానీ ఈ సినిమా విషయంలో ఎందుకో దాన్ని ప్రమోట్ చేసినంత చేయలేక పోయాడు. ఏ పెద్ద సినిమాకైనా, చిన్న సినిమాకైనా విడుదలకు ముందు వచ్చే ‘హైప్’ అనేది చాలా ముఖ్యం. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్‌లో ఉండాలంటే టీజర్, ట్రైలర్‌తో పాటు ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేలా ఈవెంట్స్ చేయాలి. కానీ ‘బైకర్’ టీమ్ మాత్రం కనీసం ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి హైప్ పెంచే ప్రయత్నం చేయలేదు.

Also Read:Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?

విడుదల వారంలో హీరో మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి ముచ్చటించిన దాఖలాలు లేవు. ప్రమోషన్లు లేకపోవడంతో సామాన్య ప్రేక్షకులకు ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయమే సరిగ్గా తెలియలేదు, దీనివల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బైకర్’ కంటెంట్ పరంగా చాలా బాగుంది, షో షోకి మౌత్ టాక్ పెరుగుతోంది. అయితే, ముందే సరైన పబ్లిసిటీ ఉండి ఉంటే.. ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉండేవని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, మంచి కలెక్షన్లతో మొదలవ్వాల్సిన సినిమా, ఇప్పుడు కేవలం ‘మౌత్ టాక్’ మీద ఆధారపడి నెమ్మదిగా పుంజుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి, ఇకనైనా యూనిట్ దూకుడు పెంచి సోషల్ మీడియాలో వస్తున్న మంచి రివ్యూలను, ప్రేక్షకుల రెస్పాన్స్‌ను భారీగా ప్రమోట్ చేయాలి.