Reading Time: < 1 minute

ఖమ్మంలో ఏప్రిల్ 4న రన్ ఫర్ జీసస్ : సీఎస్ఐ కమిటీ సభ్యులు

Caption of Image.

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రపంచ శాంతి ర్యాలీ పిలుపులో భాగంగా ఖమ్మంలో ఈనెల 4న రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు సీఎస్ఐ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఖమ్మం సిటీ, రఘునాథ పాలెం, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు, సీఎస్ఐ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ సిటీలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ కాలేజ్ గ్రౌండ్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ సాగుతుందన్నారు. అనంతరం పోస్టర్​ ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో రన్ ఫర్ జీసస్ ఖమ్మం కో ఆర్డినేటర్ రమేశ్​బాబు, నిర్వహణ కమిటీ సభ్యులు పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ జేకర్యా, వేముల సత్యం, ఏర్పుల ప్రభాకర్ రావు (హెబ్రోన్ ఎల్డర్), పల్లా రాజశేఖర్ (పీస్ కమిటీ చైర్మన్), (సీఎస్ఐ చర్చి సెక్రటరీ) సుధాకర్, ఏర్పుల కిషోర్ (సీఎస్ఐ యూత్ సెక్రటరీ), పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు కొమ్ము బాబురావు, పాల్ సంజీవరావు, రమేశ్​పాల్, నేలాల బాలస్వామి ( సుజనరాయ్ మినిస్ట్రీస్), సామ్యూల్ పిన్ని, చిన్ని డేవిడ్, జీవ రత్నం, సురేశ్, సుగుణ రాజేంద్రం, రవి కిరణ్, పల్లా కిషోర్, దాసు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.