Reading Time: < 1 minute
Us Iran War American Pilot Captured Reward Wsj Confirms Jet Crash

US-Iran War: అమెరికా ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్-35ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే,ఇప్పుడు పైలట్ విషయంపై ఉత్కంఠ నెలకొంది. విమానం కూలిపోతున్న సమయంలో ఎజెక్ట్ బటన్ నొక్కి పారాశ్యూట్ ద్వారా నేలపై ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. సదరు అమెరికన్ పైలట్ తమ చెరలో ఉన్నాడని ముందుగా ప్రకటించిన ఇరాన్ ఇప్పుడు మాట మార్చింది. పైలట్‌ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన వారికి భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ మీడియాలో ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..

నైరుతి ఇరాన్‌లో యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు. అమెరికా సైన్యం, పెంటగాన్, వైట్ హౌస్ ఈ వార్తపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక వేళ పైలట్‌ను సజీవంగా పట్టుకుంటే ఇరాన్ చేతికి కీలక ఆయుధం లభించినట్లు అవుతుంది. అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదే విధంగా పట్టుబడిన పైలట్‌ను ప్రపంచం ముందు ఉంచడం ద్వారా అమెరికాను దెబ్బతీశామనే సంకేతాన్ని పంపొచ్చు. పైలట్ విడుదలకు యూఎస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం లేదా ఇతర బేరసారాలకు ఉపయోగించుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది.

మరోవైపు అమెరికన్ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ అమెరికా యుద్ధ విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోయినట్లు చెప్పింది. సిబ్బందిని కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం యుద్ధంలో తొలిసారిగా ఒక అమెరికన్ విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోయడం ఇదే తొలిసారి.