
వేడుకలోపలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాల ప్రారంభోత్సవ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాస మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట్ రమణా రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
►ALSO READ | తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజి రెడ్డి ,ఏవీఎన్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ ఏవీఎన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యా రంగంలో నాణ్యమైన విద్య అందించడంపై తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గ్లోబల్ స్థాయి విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు