Reading Time: < 1 minute

హైదరాబాద్ క్వేక్ పబ్ డ్రగ్స్ కేసులో IAS కొడుకు.!

Caption of Image.

హైదరాబాద్ లోని  క్వాక్ పబ్‌లో జరిగిన డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఏప్రిల్ 2న  రాత్రి పబ్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.నిన్న రాత్రి పబ్‌లో పోలీసులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలగా.. ఈరోజు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో ఏడుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ కేసులో రిత్విక్ అనే యువకుడి రిపోర్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతనికి నిర్వహించిన టెస్టులో కల్లుతో పాటు ‘బెంజోడియాజెపైన్’ పాజిటివ్‌గా వచ్చింది. అయితే రిత్విక్ కల్లు తాగడంతో పాటు డిప్రెషన్ కోసం ట్యాబ్లెట్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రిత్విక్ మినహా మిగిలిన ఏడుగురికి వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరికి నోటీసులు ఇచ్చి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరెవరికీ గతంలో ఎటువంటి డ్రగ్స్ హిస్టరీ లేదని పోలీసులు స్పష్టం చేశారు.

►ALSO READ | క్వేక్ అరీనా పబ్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు…

డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన ఏడుగురిలో ఆరుగురు హైదరాబాద్‌కు చెందినవారు కాగా.. ఒకరు మహారాష్ట్రకు చెందిన మొబైల్ షాప్ ఓనర్ రితీష్. అయితే వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఐఏఎస్ అధికారి కుమారుడు ఆకెళ్ళ హరిత్ సారంగ కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నిన్న డ్రై డే అయినప్పటికీ రాత్రి 10 గంటల తర్వాత పబ్‌లో అక్రమంగా మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న జరిగిన ఈవెంట్‌కు సుమారు 1500 మంది హాజరయ్యారు. అయితే పట్టుబడ్డ యువకులు పబ్‌లోనే డ్రగ్స్ తీసుకోలేదని.. వారు ఒక్కొక్కరు ఒక్కో చోట గంజాయి, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

©️ VIL Media Pvt Ltd.