Reading Time: 2 minutes
Ipl 2026 Controversy Lsg Vs Dc Lalit Modi Slams Sanjiv Goenka As Loser Joker

Lalit Modi: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్‌ తో గ్రౌండ్ లోనే చర్చించడం మరోసారి క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌ గా మారింది. మైదానంలో గోయెంకా పంత్‌ తో మాట్లాడటం చూస్తుంటే, ఆయన అసహనంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ మొదలయ్యాయి.

గతంలో 2024 సీజన్‌లో అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ తో కూడా గోయెంకా ఇలాగే ప్రవర్తించిన వీడియో తెగ వైరల్ కావడంతో, నెటిజన్లు ఇప్పుడు ఆ పాత ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోపై X వేదికగా “టోర్నమెంట్ మొదలై ఒక్క మ్యాచ్ మాత్రమే అయ్యింది.. దీనికి అంత అవసరం లేదు” అని మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ పేర్కొన్నారు.

రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

ఇక దీనికి ప్రతిస్పందనగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజీవ్ గోయెంకాను “లూజర్, జోకర్” అని సంబోధిస్తూ.. ఒకవేళ తాను ఐపీఎల్ చైర్మన్‌ గా ఇపుడు ఉండి ఉంటే అతనిపై శాశ్వత నిషేధం విధించి.. ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకునేవాడినని మండిపడ్డారు. అంతేకాకుండా బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకుని గోయెంకాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారం ముదురుతుండటంతో లక్నో ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగా “మీరు చూసేవన్నీ నిజం కాకపోవచ్చు.. కెమెరాలు కట్ అయిన తర్వాత ఉండే అసలైన వాతావరణం ఇది” అంటూ మరో కోణంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో గోయెంకా, పంత్ మధ్య వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. గోయెంకా, పంత్ మధ్య ఉన్నది కేవలం స్నేహపూర్వక చర్చ మాత్రమేనని జట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే సంజీవ్ గోయెంకా రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచారు. “సీజన్ ఇంకా చాలా ఉంది.. ఇలాంటి క్షణాలు ఏదైనా అర్థవంతమైనది నిర్మించే క్రమంలో ఎదురవుతుంటాయి. మా కెప్టెన్, జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మేము బలంగా తిరిగి వస్తాం” అంటూ ఆయన అన్నారు. ఎకానా స్టేడియంలో మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, లక్నో సూపర్ జెయింట్స్ కథ ఇంకా ముగియలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.