
ఉక్కుపాదం మోపడం వల్ల పట్టుబడుతున్నారా? పట్టుబడినా జరిగేదేముందని మరింత బరితెగిస్తున్నారా? హైదరాబాద్ పరిధిలోని.. ఓ వైపు ఫాంహౌస్‌ల్లో, మరోవైపు పబ్‌ల్లో డ్రగ్ పార్టీలు యధేచ్చగా జరుగుతున్నాయి. లేటెస్ట్.. కొండాపూర్‌లో మిడ్‌నైట్ డ్రగ్ మసాలా రాకెట్ బయటపడిన కొన్ని గంటల్లోనే.. డ్రగ్స్ అమ్ముతూ మహిళ పట్టుబడటం కలకలం రేపింది.. సికింద్రాబాద్‌లోని పారడైజ్ సమీపంలోని సన్‌షైన్ హాస్పిటల్ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏడున్నర గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు, ముంబైలో గ్రాము 15వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో 30వేల రూపాయిలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆటోలో వచ్చిన మహిళ.. డ్రగ్స్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తుండగా.. సికింద్రాబాద్ డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 5 పాకెట్లలో కొకైన్ దాచి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
Drugs Case
కొండాపూర్‌లో మిడ్‌నైట్ డ్రగ్ మసాలా రాకెట్..
ఇదిలాఉంటే.. గత రాత్రి.. కొండాపూర్‌లో మిడ్‌నైట్ డ్రగ్ మసాలా రాకెట్‌ను బ్రేక్ చేసింది ఈగల్ టీమ్.. క్వేక్ ఏరినా పబ్‌లో బ్లాక్ కాఫీ పేరిట నైజీరియాకు చెందిన DJ ప్లేయర్‌తో పబ్‌లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఐతే డ్రగ్‌పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈగల్ టైమ్స్ రెయిడ్ చేశాయి. మత్తులో ఊగుతున్న 64 మందికి డ్రగ్ టెస్ట్‌లు నిర్వహిస్తే 8మందికి పాజిటివ్ అని తేలింది.. కానీ 24 గంటల్లోపే ఆ లెక్క మారింది. ఏడుగురినే డ్రగ్ కన్స్యూమర్లుగా చూపించారు పోలీసులు. రిత్విక్ అనే అతనికి యూరిన్ టెస్ట్‌లో డ్రగ్ పాజిటివ్ అని తేలింది. కానీ ఆ తరువాత ఎర్రగడ్డ వైద్యుల నిర్వహించిన బ్లడ్ టెస్ట్‌లో రిత్విక్ కు నెగిటివ్ అని వచ్చింది.
నిద్ర మాత్రలు కారణంగానే యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారన్నారు పోలీసులు.ఇక డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన ఆ ఏడుగురిలో ఎవరికీ ప్రీవియస్ హిస్టరీ లేదన్నారు పోలీసులు. ఇక క్వేక్ ఏరినా పబ్‌లో పార్టీకి అటెండైన నటి హేమ..తనకు డ్రగ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేశారు.
ఈగల్ టీమ్స్ రంగంలోకి దిగాక డ్రగ్ కేసుల గ్రాఫ్ పెరుగుతోంది. డ్రగ్ మాఫియా బెండు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు.. ఈ క్రమంలోనే.. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..