
టాలీవుడ్ సీనియర్ నటి రాధా ప్రశాంతి ఒక స్టార్ ప్రొడ్యూసర్‌తో తనకు ఎదురైన ఒక వివాదాస్పద సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది ఎర్ర సూర్యుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. అప్పట్లో కేవలం ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న ఆ వ్యక్తి, ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా ఎదిగారని ఆమె తెలిపారు. రాధా ప్రశాంతి దుస్తులు మార్చుకుంటున్న సమయంలో ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఆమె గది తలుపు తీశారట. ఆమె వెంటనే తలుపు మూసి, సారీ, నేను బట్టలు మార్చుకుంటున్నాను అని చెప్పినప్పటికీ, అతను పదే పదే గట్టిగా తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాధా ప్రశాంతి తలుపు తెరిచి అతన్ని నిలదీశారు.
ఆ సందర్భంలో, సదరు మేనేజర్ మాట్లాడుతూ, “మీరు పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఔట్ డోర్ షూటింగ్‌లలో చెట్ల పక్కన దుస్తులు మార్చుకుంటారు. ఇలా డోర్లు వేసుకుని మార్చుకుంటే ఇండస్ట్రీలో ఉండలేరు. మీలాంటి వారిని ఎంతో మందిని చూశాం” అని చెప్పాడట. దీనికి బదులిస్తూ, రాధా ప్రశాంతి తాను కూడా చాలా మందిని చూసే ఇండస్ట్రీకి వచ్చానని, తన నేపథ్యం నక్సలైట్ల కుటుంబమని, న్యాయం జరగక చాలామంది తనతోటి వారు ఆ మార్గంలోకి వెళ్ళారని వివరించారు.
ఇది చదవండి: అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..