
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల… ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ మ్యాడ్ నెన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ “క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్‌టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది”అని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “రాకాస’ గురించి రామ్ చరణ్ చాలా గొప్పగా మాట్లాడారు. ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు. మానస శర్మ మాట్లాడుతూ “రాకాస’లో కథ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మన జానపదాలు, కల్చర్ అనేవి ఈ తరానికి అర్థమయ్యేలా, నచ్చేలా ఈ మూవీని తీశాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నయన్ సారిక, మన్యం రమేష్, జీ స్టూడియో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య పాల్గొన్నారు.