
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సైంటిస్ట్-–బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: సైంటిస్ట్– బి ( గ్రూప్––ఏ ఎస్ & టీ గెజిటెడ్)
మొత్తం ఖాళీలు: 243.
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్ సైన్స్ & ఐటీ – అన్ రిజర్వ్డ్ 70, కంప్యూటర్ సైన్స్ & ఐటీ – ఎస్సీ 25, కంప్యూటర్ సైన్స్ & ఐటీ – ఎస్టీ 12, కంప్యూటర్ సైన్స్ & ఐటీ – ఓబీసీ 45, కంప్యూటర్ సైన్స్ & ఐటీ – ఈడబ్ల్యూఎస్ 16, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – అన్ రిజర్వ్డ్ 13, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – ఎస్సీ 03, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – ఎస్టీ 01, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – ఓబీసీ 06, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – ఈడబ్ల్యూఎస్ 02, డేటా సైన్స్ & ఏఐ అన్ రిజర్వ్డ్ – 22, డేటా సైన్స్ & ఏఐ– ఎస్సీ 07, డేటా సైన్స్ & ఏఐ– ఎస్టీ 03, డేటా సైన్స్ & ఏఐ – ఓబీసీ 13, డేటా సైన్స్ & ఏఐ – ఈడబ్ల్యూఎస్ 05.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత రంగాల్లో ఏఎంఐఈ/ డీఓఈఏసీసీ బి– లెవల్/ పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే 2024/ 2025/ 2026 గేట్ స్కోరును కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. ఓబీసీ మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 27.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 24.
సెలెక్షన్ ప్రాసెస్
2024/ 2025/ 2026 వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉన్న అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ కోసం విభాగాలు, కేటగిరీల వారీగా 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అకడమిక్ ప్రతిభ, టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ అంశాలపై 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఫైనల్ మెరిట్ లిస్ట్: గేట్ స్కోరుకు 60 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
ఇంటర్వ్యూలో కనీస అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 50 శాతం, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.recruitment.nic.inను సందర్శించండి.