Reading Time: < 1 minute
Abhishek Sharma Creates History First Indian To Hit 100 Sixes For Srh In Ipl

Abhishek Sharma Creates History in IPL for SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికారుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ నాలుగు సిక్సర్లు బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. కోల్‌కతాపై అభిషేక్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 48 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.

ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అతడు 143 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 101 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ (89) మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ (64) ఉండగా.. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ (50) ఉన్నాడు. అభిషేక్, క్లాసెన్, హెడ్ ఆక్టివ్ ప్లేయర్స్. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రికార్డులను మరింత మెరుగుపరచే అవకాశం ఉంది. అభిషేక్ త్వరలోనే వార్నర్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన లిస్ట్:
# డేవిడ్ వార్నర్ – 143
# అభిషేక్ శర్మ – 101*
# హెన్రిచ్ క్లాసెన్ – 89 *
# కేన్ విలియమ్సన్ – 64
# ట్రావిస్ హెడ్ – 50 *