Reading Time: < 1 minute

ముంబాయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియాకు చెందిన మహిళను ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…నైజీరియా దేశానికి చెందిన జేమ్స్ టెస్లింగ్ యామ్యూనల్ ముంబాయిలో ఉంటోంది. దేశంలోని పలు నగరాలకు కొకైన్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకుని బయలు దేరినట్లు ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శికృష్ణకు తెలిసింది. దీంతో వీరు తమ సిబ్బందితో కలిసి జేమ్స్ టెస్లింగ్ కోసం సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రి సమీపంలో వేచి ఉన్నారు.

ముంబాయి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చిన టెస్లింగ్ ఆటోలో ఆస్పత్రి వద్దకు రాగానే ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబాయిలో గ్రాముకు రూ.15,000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి రూ.30వేలకు విక్రయిస్తోంది. నిందితురాలిని అరెస్టు చేసిన ఎక్సైజ్ సిబ్బంది కేసు దర్యాప్తు కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లు రాజు, రవి, శిల్ప కలిసి పట్టుకున్నారు.