Reading Time: < 1 minute
సీక్రెట్‌గా వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసిన హీరో.. వైరల్ అవుతున్న వీడియో

చాలా మంది హీరోలు తమ సినిమాలను తాము చూసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. నటించడం వరకే మన పని అది చేసేశాం ఇక ఆడియన్స్ దే బాధ్యత అన్నట్టు ఉంటారు. మరికొంతమంది మాత్రం మొదటి రోజే తమ సినిమాలను ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అభిమానులతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కాగా కొంతమంది హీరోలు తమ సినిమాలను తామే చూడటానికి దొంగచాటుగా వెళ్తుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఆయన సినిమాలను చూడటానికి సీక్రెట్ గా వెళ్తూ ఉంటారు. అలాగే దళపతి విజయ్ కూడా సీక్రెట్ గా సినిమాలు చూస్తూ ఉంటారు. అదే తరహాలో తాజాగా ఓ స్టార్ హీరో తన సినిమాను తానే సీక్రెట్ గా వెళ్లి ఆడియన్స్ తో కలిసి చూసి ఎంజాయ్ చేశాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

సీక్రెట్ గా తన సినిమాను ఆడియన్స్ తో కలిసి చూసి ఎంజాయ్ చేశాడు. ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఎవరో కాదు స్టార్ హీరో ఆర్ మాధవన్. ఒకప్పుడు లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మాధవన్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మాధవన్ ఇప్పుడు సహాయక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే ధురంధర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ధురంధర్  సినిమాలో అజయ్ సన్యాల్ పాత్రలో నటించారు మాధవన్.

ఆర్. మాధవన్ ఒక థియేటర్‌లో సీక్రెట్ గా ధురంధర్ రివెంజ్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు ఇలా రాసుకొచ్చారు. “ఐఎస్ఐ వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ వాళ్లకు ఒక విషయం తెలియాలి, అజయ్ సన్యాల్ ఎప్పుడూ వాళ్లపై కన్నేసి ఉంచుతాడు” అంటూ మాధవన్ రాసుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు  వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by NewsMobile (@newsmobileindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.