Reading Time: 2 minutes
Biker Movie Review: ‘బైకర్’ సినిమా రివ్యూ.. శర్వానంద్ మరో హిట్ కొట్టేసాడా..?

మూవీ రివ్యూ: బైకర్

నటీనటులు : శర్వానంద్, డా. రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, తదితరులు.

సంగీతం : జిబ్రాన్

సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్

ఎడిటింగ్ : అనిల్ పసల

దర్శకుడు : అభిలాష్ రెడ్డి

నిర్మాతలు: వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి

 

కథ:

విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్)కి బైక్ రేసింగ్ అంటే ప్రాణం. మోటోక్రాస్ రేసింగ్‌లో ప్రపంచస్థాయిలో ఇండియన్స్‌కి గుర్తింపు తీసుకురావాలనేది అతని బలమైన లక్ష్యం. ఈ జర్నీలో అతనికి తన తండ్రి, కోచ్ అయిన బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) తో కొన్ని ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విక్కీకి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు విక్కీ రేసింగ్ ఎందుకు వదిలేశాడు? అనన్య (మాళవిక నాయర్)తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ జీవితంలో ఆమె పాత్ర ఏమిటి? రేసింగ్ మానేశాక విక్కీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది తెరపై చూడాల్సిన కథ.

కథనం:

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ‘బైకర్’ కచ్చితంగా మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ సినిమా కాదు.. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. డిటైలింగ్ కోసం కాస్త టైమ్ తీసుకోవడం వల్ల అక్కడక్కడా కాస్త స్లో నేరేషన్ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చేసరికి కథను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి క్యూరియాసిటీ పెంచాడు. ఇక కీలకమైన సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగుతుంది. నిజానికి ఇది చిన్న కథే అయినా, మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ అనేసరికి విపరీతమైన ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్, అవి చూస్తున్నప్పుడు వచ్చే జిబ్రాన్ సౌండ్ డిజైనింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఇక శర్వానంద్, మాళవిక నాయర్ మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులకు కాస్త ‘జెర్సీ’ సినిమా వైబ్స్ ను గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం గుండెను హత్తుకునేలా బలంగా వర్కౌట్ అయ్యాయి.

నటీనటులు:

ఈ క్యారెక్టర్ కోసం శర్వానంద్ అక్షరాలా తన ప్రాణం పెట్టేసాడు. పర్ఫెక్ట్ రేసర్‌లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేజర్ హైలైట్ మాత్రం డా. రాజశేఖర్ పాత్ర. ఒక రకంగా ఆయనే ఈ సినిమాకు ప్రాణం పోశాడు. రాజశేఖర్ కెరీర్‌కు ఇది కచ్చితంగా సాలిడ్ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. మాళవిక నాయర్ పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

టెక్నికల్ టీం:

జిబ్రన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్. తన నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ చేశాడు. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త ఫోకస్ చేయాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బైకర్.. ఎంగేజింగ్ రేసింగ్ సినిమా.. ఎమోషనల్ రోలర్ కోస్టర్..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.