
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్ లో అతిపెద్ద B1 బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లో 8 బ్రిడ్జిలు కూల్చేస్తామంటూ హిట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఇరాన్. ఇరాన్ అధికారిక మీడియా ఫార్స్ న్యూస్ ఏజెన్సీ B1 బ్రిడ్జి కూల్చివేతను ధ్రువీకరించిన తర్వాత ఈ హిట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఇరాన్. భవిష్యత్తులో జరిగే దాడులకు IRGC బాధ్యత వహిస్తుందని పరోక్షంగా తెలిపింది.
ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్న 8 బ్రిడ్జిలు ఇవే:
- కువైట్ లోని షేక్ జాబెర్ అల్-అహ్మద్ అల్-సబా సీ బ్రిడ్జి
- యూఏఈ లోని షేక్ జాయెద్ బ్రిడ్జి
- యూఏఈ లోని అల్ మఖ్తా బ్రిడ్జి
- యూఏఈ లోని షేక్ ఖలీఫా బ్రిడ్జి
- సౌదీ అరేబియా–బహ్రెయిన్ లోని కింగ్ ఫహద్ కాజ్‌వే బ్రిడ్జి
- జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్ బ్రిడ్జి
- జోర్డాన్ లోని డామియా బ్రిడ్జి
- జోర్డాన్ లోని అబ్దౌన్ బ్రిడ్జి
ఇరాన్ లోని కరాజ్ సిటీలో నిర్మాణంలో ఉన్న అతిపెద్ద బ్రిడ్జిని గురువారం అమెరికా పేల్చివేసింది. బ్రిడ్జి కూలిపోతున్న వీడియోను ట్రంప్ ఈ మేరకు షేర్ చేశారు. ఇలాంటివే మరిన్ని దాడులు ఉంటాయని హెచ్చరించారు.
కాగా, ఇరాన్ కూడా గురువారం ఇజ్రాయెల్తో పాటు గ ల్ఫ్ దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య చనిపోయారు.
B1 బ్రిడ్జిపై జరిగిన దాడిని అబ్బాస్ అరాఘ్చి ఖండించారు. ఇలాంటి చర్యలకు ఇరాన్‌లొంగిపోదని.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇది అమెరికా ఓటమికి, నైతిక పతనానికి సంకేతమని పేర్కొన్నారు.