Reading Time: < 1 minute

విరుచుకు పడుతున్న ఇరాన్.. మరో అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత.. కువైట్ రిఫైనరీపై డ్రోన్ దాడి

Caption of Image.

అతిపెద్ద బ్రిడ్జి పేల్చివేతతో ఇరాన్ తోక తొక్కిన తాచులా దూకుతోంది. దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో దాడులు చేస్తోంది. కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ తో దాడి చేసింది. దీంతో రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. రిఫైనరీ పాక్షికంగా డ్యామేజ్ అయినట్లు కువైట్ ప్రకటించింది. 

మరోవైపు అమెరికాకు చెందిన మరో ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు ప్రకటించింది ఇరాన్. US F-35 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు క్లెయిమ్ చేసుకుంది. ఇరాన్ దాడితో ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఆ దాడిలో పైలట్ ప్రాణాలతో ఉన్నాడనే గ్యారెంటీ లేదని ప్రకటనలో పేర్కొన్నారు. 

గతంలోనే యూఎస్ జెట్ కూల్చివేయడం ప్రపంచ వ్యాప్తంగా డిబేట్ నడిచింది. సాధారణ డ్రోన్లతో అమెరికాకు చెందిన ఖరీదైన, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసినవిగా చెప్పుకునే జెట్ లను కూల్చివేసినట్లు ఇరాన్ చెబుతోంది.

మరోవైపు సౌదీలోనూ డ్రోన్స్ దాడి జరిగినట్లు ఆదేశం చెప్పింది. గురువారం (మార్చి 02) సాయంత్రం ఐదు డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ తెలిపింది. మరోవైపు ఇరాన్ కు 

©️ VIL Media Pvt Ltd.