
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 6న అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే కెటిఆర్.. జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలిసింది.