Reading Time: < 1 minute

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీ తర్వాత మరొక పాటు ఆ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి. సినీ నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మొత్తం 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా ఆ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈసారి పోటీలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిజెపి తరఫున పోటీలో దిగుతున్నారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారు. వనతి శ్రీనివాసన్ కోయంబత్తూర్(నార్త్) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బిజేపి చీఫ్ నైనార్ నాగేంద్రన్ అవనాశి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.