
March Gold, Silver Price: 2026 మార్చి నెల భారతీయ ఇన్వెస్టర్లకు, సామాన్య ప్రజలకు ఒక కీలకమైన మాసంగా నిలిచింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ వివాదం), ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నెలలో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలను తాకాయి. మార్చి 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,73,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,650 వద్ద ఉంది. అదే మార్చి 31వ తేదీ నాటికి భారీ స్థాయిలో పతనం అయ్యింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,510 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,050 వద్ద కొనసాగింది. అంటే నెల రోజుల్లో తులం బంగారంపై దాదాపు రూ.23,580 వరకు దిగి వచ్చింది.
ఇక వెండి విషయానికొస్తే మార్చి 1వ తేదీన కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద ఉండగా, అదే మార్చి 31వ తేదీన రూ.2,50,000 వద్ద ట్రేడయ్యింది. అంటే నెల రోజుల్లో కిలో వెండిపై 45 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.
అలాగే 2026 మార్చి నెలలో బంగారం ధరలు ఒకే దిశలో కదలలేదు. మొదట భారీగా పెరిగి, మధ్యలో పడిపోయి, చివర్లో మళ్లీ కొంత రికవరీ చూపించాయి. మొత్తంగా చూస్తే మార్చి నెలలో భారీ వోలాటిలిటీ (అస్థిరత) కనిపించింది. వివిధ నివేదికల ప్రకారం..
మార్చి ప్రారంభం (1–10 తేదీలు): భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. అదే 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ.16,800 / గ్రాము, అదే 10 గ్రాముల ధర రూ.1.68 లక్షలు, 22 క్యారెట్: రూ.15,400 / గ్రాముకు. అంటే ఇది హై లెవల్ (రికార్డ్ స్థాయి దగ్గర) అని చెప్పొచ్చు. అయితే 5–6 తేదీల మధ్య ధరలు కాస్త తగ్గడం ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: ATM Withdrawals: ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? మీకో బ్యాడ్‌న్యూస్..!
మార్చి 10–20 తేదీలలో పతనం
ఈ సమయంలో బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. మార్చి 10 ప్రాంతంలో రూ.1.60 లక్షల వద్ద ఉండగా, మార్చి 15 నాటికి రూ.1.55–రూ.1.59 లక్షల మధ్య కొనసాగింది. అలాగే మార్చి 19న మరింతగా భారీగా పతనం అయ్యింది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.రూ.1.49–రూ.1.50 లక్షలుగా ఉంది. ఈ దశలో మార్కెట్‌లో డౌన్‌ట్రెండ్ స్పష్టంగా కనిపించింది
మార్చి 20–25 తేదీలలో చిన్నపాటి పెరుగుదల కనిపించింది. అలాగే మార్చి 20 ప్రాంతంలో ధరలు కొంచెం పెరిగి రూ.1.46 లక్షల వరకు చేరాయి. అదే మార్చి 22 ప్రాంతంలో రూ.1.45 లక్షల దగ్గర స్థిరంగా ఉన్నాయి
మార్చి చివరి 26–31 తేదీలలో మళ్లీ పెరుగుదల చోటు చేసుకుంది. మార్చి 30న ధరలు మళ్లీ పెరిగాయి తులం ధర రూ.రూ.1.45 లక్షల పైగా ఉండగా, మార్చి 31న కూడా స్వల్ప పెరుగుదల కొనసాగింది.
ఇది కూడా చదవండి: Air Cooler: ఏసీని సైతం తలదన్నే ఎయిర్ కూలర్.. అతి తక్కువ ధరల్లోనే ఏసీ లాంటి కూలింగ్!
ధరలు మార్పునకు ప్రధాన కారణాలు
మార్చి నెలలో గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గాయి. మొత్తం నెలలో సుమారు 10–12% వరకు పతనం నమోదైంది.
పశ్చిమ ఆసియా యుద్ధ వాతావరణం: పశ్చిమ ఆసియాలో (West Asia) నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు.
డాలర్ బలం – రూపాయి బలహీనత: అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటంతో, దిగుమతి చేసుకునే బంగారం భారత్ లో మరింత ప్రియమైంది.
పెట్రోల్ ధరల ప్రభావం: పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలలో పెట్రోల్ ధరలు రూ.450 దాటడం, ప్రపంచ ఇంధన సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, పరోక్షంగా విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపాయి.
కేంద్ర బ్యాంకుల నిల్వలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (ముఖ్యంగా చైనా, భారత్) తమ గోల్డ్ రిజర్వులను పెంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది.
తాజా ధరలు:
ఇక తాజాగా ఏప్రిల్ 3వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగేతోంది. అలాగే హైదరాబాద్, చెన్నై, కేరళలో అయితే కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,55,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి