Reading Time: < 1 minute
Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్..

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందే సౌకర్యం ఉన్న మీ సేవ సర్వీసులు నిలిచిపోనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. తాత్కాలికంగా 36 గంటల పాటు సేవలు ఆగిపోతున్నాయి. దీంతో శనివారం, ఆదివారం రెండు రోజులు ప్రజలకు మీ సేవలో సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి సోమవారం నుంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సేవలు నిలిచిపోనుడటంతో మీ సేవ కేంద్రాలు కూడా ఖాళీగా ఉండనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సాఫ్ట్‌వేర్ అప్డేట్

కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నారు. దీంతో షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా సేవలు నిలిచిపోతున్నాయి. ఈ మేరకు దీనికి సంబంధించి ప్రజలకు మీ సేవ కేంద్రాలు సమాచారం అందిస్తున్నాయి. సెంటర్ల వద్ద “ప్రజలకు ముఖ్య గమనిక.. మీ సేవ సేవలు నిలిచిపోనున్నాయి” అంటూ ఓ పోస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వాట్సప్ గ్రూపుల్లో దీని గురించి సమాచారం అందిస్తున్నారు. మీ సేవ సేవలు రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని, ప్రజలకు సహకరించాలని కోరుతున్నారు. దీనిని గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పనులు ఉంటే ముందుగానే చేసుకోవాలని చెబుతున్నారు.

వాట్సప్ మీ సేవ సేవలు కూడా బంద్

వాట్సప్ ద్వారా మీ సేవలో అందించే సేవలన్నింటినీ పొందే అవకాశం తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం ఓ నెంబర్‌ను లాంచ్ చేసింది. ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేయడం ద్వారా వాట్సప్‌లోనే సులువుగా సర్వీసులను పొందవచ్చు. ఇందుకోసం మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. దీని వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి.  గత ఏడాది వాట్సప్ సేవలను అందుబాాటులోకి తీసుకురాగా.. ప్రజల నుంచి అద్బుత స్పందన వస్తోంది. కాగా ఇటీవల మీ సేవ సర్వీస్ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. మీ సేవ నిర్వాహకులు తమకు వచ్చే కమిషన్ పెంచాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నారు. దీంతో ఇప్పుడు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలపై అదనపు భారం పడనుంది. గతంలో రూ.35గా ఉన్న కనీస ఛార్జిలను రూ.65కి పెంచారు.