Reading Time: < 1 minute

అణుశక్తితో నడిచే జలాంతర్గామి అరిధమాన్..త్వరలోనే రంగంలోకి! ఏంటి దీని స్పెషల్ !

Caption of Image.

భారత అమ్ముల పొదిలోకి మరో జలాంతర్గామి చేరనుంది. అణుశక్తితో నడిచే మూడో సబ్మెరైన్ భారత జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైనట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. INS అరిధమాన్.. ఇది ఒక పదం కాదు.. మాట కాదు.. ఇది ఒక శక్తి.. అంటూ ట్వీట్ చేశారు. ఫైనల్ టెస్టులు పూర్తి చేసుకున్న అరిధమాన్.. వ్యూహాత్మక గస్తీలో భాగంగా త్వరలోనే నేవీకి అందించనున్నారు. 

INS అరిధమాన్ గురించి..

అరిధమాన్ అంటే శత్రువులను శిక్షించేవాడు లేదా శాశ్వత విజయం అని అర్థం. భారత నౌకాదళానికి చెందిన అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి అరిధమాన్. ఇది అరిహంత్- సిరీస్ లో మూడోది. S4 వ్యూహాత్మక అణు జలాంతర్గామి. ఇది అణుశక్తితో నడిచే జలామతర్గాముల శక్తి ని మరింత బలోపేతం చేస్తుంది. భారత్ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలో స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాన్ని చాటిచెప్పే మరో జలాంతర్గామి కానుంది.

శక్తి సామర్థ్యాలు:

ఈ జలాంతర్గామి సుమారు 7,000 టన్నుల బరువు కలిగి, ఇంతకు ముందున్న వాటి కంటే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. మెరుగైన స్టెల్త్, అకౌస్టిక్ పనితీరు కోసం దీని బాడీ  రూపొందించారు. బాబా అణు పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన, ఆధునీకరించిన 83 మెగావాట్ల ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ దీనికి శక్తిని అందిస్తుంది.

అరిధమాన్‌లో ఎనిమిది వర్టికల్ లాంచ్ ట్యూబ్స్ఉన్నాయి, ఇవి ఐఎన్ఎస్ అరిహంత్ తో పోల్చితే రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి.  దీనివల్ల ఇది 3,500 కిలోమీటర్ల పరిధిలో గల ఎనిమిది కె-4 దీర్ఘశ్రేణి క్షిపణులను ఛేదిస్తుంది. 750 కిలోమీటర్ల పరిధి గల 24 కె-15 క్షిపణులను ప్రయోగించగలదు. ఈ సామర్థ్యంతో సముద్రంలో నిరంతరం గస్తీలో ఉంటూ శత్రువుల దాడులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.