Reading Time: < 1 minute

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎస్‌డిటి19’ సినిమా ఊహకు అందని స్థాయిలో రూపొందుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది. దర్శక ద్వయం సుజిత్, సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరు క సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిథిక్ సై-ఫై నేపథ్యంలో హై-ఆక్టేన్ కథనాన్ని మిళితం చేస్తూ, గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.