
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 19న విడుదలైదన ధురంధర్ 2 భారీ వసూళ్లు రాబడుతోంది. సినిమా రిలీజై దాదాపు రెండు వారాలు గడుస్తున్నా హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్ల కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో ధురంధర్ ది రివేంజ్ రెండు వారాల కలెక్షన్ల వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 15 రోజుల్లో ఈ సినిమాకు రూ.1501 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. ఇందులో ఇండియా నుంచి రూ.1134 కోట్లు కాగా, ఓవర్సీస్ ద్వారా రూ. 364 కోట్లు వచ్చాయి. కాగా మొదటి వారంలోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లును దాటిన ధురంధర్ ది రివేంజ్ రెండో వారంలో కాస్త మందగించింది. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందీ క్రేజీ సీక్వెల్. తద్వారా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఆదిత్య ధర్. రణవీర్ సింగ్ భారతీయ గూఢచారి హంజా అలీ మజారి పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని ప్రియురాలిగా సారా అర్జున్ యాక్ట్ చేసింది. వీరితో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పాండోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
15 రోజుల్లో ధురంధర్ 2 కలెక్షన్ల వివరాలు ఇవే..
Duniya bhar mein goonj rahi hai naye Hindustan ki dahaad.
Day-wise break-up | India
Week 1: ₹690 Cr*
DAY 9: ₹42 Cr*
DAY 10: ₹64 Cr*
DAY 11: ₹71 Cr*
DAY 12: ₹26 Cr*
DAY 13: ₹28 Cr*
DAY 14: ₹21 Cr*
Day 15: ₹19 Cr*
India: ₹961 Cr*
Worldwide GBOC (2 weeks)India:… pic.twitter.com/jF0uS998P1
— Jio Studios (@jiostudios) April 3, 2026
900 NOT OUT – ‘DHURANDHAR 2’ BEGINS ITS MARCH TOWARDS ₹ 1000 CR… #DhurandharTheRevenge continues to rewrite the record books… The phenomenal Week 2 business clearly indicates that #Dhurandhar2 is on track to become the first #Hindi film to breach the ₹ 1000 cr mark. https://t.co/tWI75KcvfD pic.twitter.com/7wlTlPymaE
— Mr.RK (@RavikumarJSP) April 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
