Reading Time: 2 minutes

మీ మెదడు జాగ్రత్త! ఈ 5 అలవాట్లు మీ మెదడును ముసలివిగా మారుస్తాయట!

Caption of Image.

నిద్రలేక పోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందనే వార్త వినడానికి కొంచెం భయంగా ఉన్నా, ఇది మనం తెలుసుకోవాల్సిన నిజం. నిజానికి చాలా మంది పెద్దగా గమనించని కొన్ని అలవాట్ల వల్ల అది నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటుంది. సహజంగా మన మెదడు ఆరోగ్యం మనం రోజు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రముఖ అనస్థీషియా డాక్టర్ ప్రకారం దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు… అవేంటో చూద్దాం….

 నిద్ర సరిగా లేకపోతే
మనం పడుకున్నప్పుడే మెదడు దానంతట అది క్లీన్ చేసుకుంటుంది. పనికిరాని వ్యర్థాలను తీసేసి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అయితే సరిగా నిద్రపోని వారిలో మెదడు పరిమాణం తగ్గుతుందని ఒక కొత్త పరిశోధనల్లో తేలింది. దింతో తక్కువ నిద్ర మెదడును త్వరగా ముసలిదిగా మారుస్తుంది.

 ఎప్పుడూ ఒత్తిడి పడకండి
చిన్నపాటి టెన్షన్లు పర్వాలేదు కానీ, రోజూ ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురైతే అది మెదడు మీద చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గుతుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి దెబ్బతింటుంది. మెదడు సమాచారాన్ని గుర్తుంచుకునే పద్ధతినే ఇది మార్చేస్తుంది.

 రక్తంలో చక్కెర శాతం 
షుగర్ వ్యాధి ఉన్నవారు లేదా తీపి ఎక్కువగా తినేవారు జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే మెదడులోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ సరిగా జరగక, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.

►ALSO READ | బీపీ ఉన్న వారు ఈ 3 డ్రింక్స్‌కు దూరంగా ఉండాల్సిందే !

 వినికిడి లోపం ఉంటే
వయసు పెరిగేకొద్దీ వినికిడి తగ్గడం సహజం, కానీ దానిని పట్టించుకోకపోతే మెదడు మందగిస్తుంది. సరిగా వినబడకపోవడం వల్ల మెదడుకు అందాల్సిన ప్రేరణ  అందదు. ఇది మెల్లిమెల్లిగా మతిమరుపు వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంది.

 మెదడు కోసం మంచి ఆహారం
మెదడు చురుగ్గా ఉండాలంటే కొన్ని పోషకాలు తప్పనిసరి. ఒమేగా-3 మెదడు కణాలను బలంగా ఉంచుతుంది. చేపలు, వాల్‌నట్స్ వంటి వాటిలో ఇది దొరుకుతుంది. అలాగే క్రియేటిన్ మెదడుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. మనం అలసిపోయినప్పుడు కూడా మెదడు పని చేసేలా చేస్తుంది.

 మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి, సరైన ఆహారం.. ఇవే మీ మెదడును యవ్వనంగా ఉంచుతాయి. ఇవి చిన్న చిన్న మార్పులే అయినా, భవిష్యత్తులో మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి!

©️ VIL Media Pvt Ltd.