Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వేరుకుంపటితో బిఆర్ఎస్ రోడ్డున పడిందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ గురించి చెప్పాల్సింది ఏమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని, మాజీ సిఎం కెసిఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితం అయ్యారని విమర్శించారు. ఎన్నికలు వస్తే దేవుళ్ల పేరు చెప్పడం బిజెపికి అలవాటని, తెలంగాణలో బిజెపికి స్థానం లేదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 100 సీట్లు వస్తాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.