Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయూశ్ మాత్రే(73: 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు) హాఫ్ సెంచరీ చేశాడు.రుతురాజ్ గైక్వాడ్(28: 22 బంతుల్లో 2 ఫోర్లు),సర్ఫరాజ్(32: 12 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్) పరుగులు చేశారు. శివమ్ దూబె (45: 28 బంతుల్లో ), ప్రశాంత్ వీర్ (6: 6 బంతుల్లో) నాటౌట్ గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చావల్, మార్కో జన్సన్, బార్లెట్ తలో వికెట్ పడగొట్టారు.