
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిఎస్‌కె ఆటగాడు సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో సిఎస్‌కె తొలుత బ్యాటింగ్‌కి దిగింది. అయితే బ్రాట్‌లెట్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి సంజూ(7) ప్రభ్‌సిమ్రాన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి ఆయుశ్ మాత్రే మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 1 వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 1 వికెట్ కోల్పోయి.. 71 పరుగులు చేసింది. క్రీజ్‌లో మాత్రే(43), రుతురాజ్ గైక్వాడ్ (14) ఉన్నారు.