Reading Time: < 1 minute

IPL 2026: ఆర్సీబీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సరికొత్త చరిత్ర

Caption of Image.

ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు (36) 200 ప్లస్ స్కోర్ చేసి తొలి జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆర్సీబీ, చెన్నై (35 సార్లు 200 ప్లస్ స్కోర్) పేరిట సంయుక్తంగా ఉండేది. ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 3) పంజాబ్‎తో జరిగిన మ్యాచులో 209 పరుగులు చేయడం ద్వారా ఆర్సీబీని అధిగమించింది చెన్నై. తద్వారా ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన తొలి జట్టుగా నిలిచింది చెన్నై. 

ఇక మ్యాచ్ విషయాని వస్తే.. ఐపీఎల్ 19లో భాగంగా పంజాబ్ కింగ్స్‎తో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో చెన్నై దుమ్మురేపింది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో సేఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (73) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

►ALSO READ | IPL 2026: పంజాబ్‎పై విరుచుకుపడ్డ ఆయుష్ మాత్రే..  చెన్నై భారీ స్కోర్

స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ (7) మరోసారి నిరాశపర్చగా కెప్టె్న్ రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించాడు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (32), శివమ్ దూబే (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టగా.. బార్ట్‎లెట్, యాన్సెన్, చాహల్ తలో వికెట్ సాధించారు. 

©️ VIL Media Pvt Ltd.