
ఐపీఎల్ జోష్‌లో ఉన్న క్రికెట్ అభిమానులకు బాలీవుడ్ మేకర్స్ మరో గుడ్ న్యూస్ వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. దాదా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఇండియన్ స్క్రీన్స్‌పై స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్‌లుగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఎం.ఎస్. ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా బయోపిక్ అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఏమాత్రం మిస్ అవ్వకుండా రూపొంది బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది. ఈ జానర్‌లో మరిన్ని సినిమాలు తీసే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ధోనీ సినిమా సక్సెస్ తర్వాత సచిన్ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే, ధోనీ బయోపిక్ స్టైల్‌లో కమర్షియల్ సినిమా కాకుండా డాక్యుమెంటరీ రూపంలో సచిన్ తన బయోపిక్‌ను రూపొందించారు. దీంతో ఈ సినిమాకు కమర్షియల్‌గా పెద్దగా బజ్ రాలేదు.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్ కవ్వింపు