Reading Time: < 1 minute

ఐనవోలు: హన్మకొండ జిల్లాలో ఐనవోలు మండలం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను భర్త చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పున్నేలు గ్రామంలో అజారుద్దీన్, పర్హాత్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతుళ్లు ఉమేరా (8), అయేషా(6) ఉన్నారు.   స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చగా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించాడు. 

నాలుగేళ్ల అనంతరం మళ్లీ గర్భవతి కావడంతో ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్యను అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో భార్య పిల్లలను తమ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, అందులో తోసేసి హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజారుద్దీన్ పట్ల అనుమానం ఉందని ఫర్హాత్ తండ్రి పోలీసులకు తెలపాడు. తండ్రిని అదుపులోకి తీసుకుని తనదైనశైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.