Reading Time: < 1 minute

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో గెలుపు ఖాతా తెరవాలని చెన్నై భావిస్తోంది. ఇక గుజరాత్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్.. అదే విక్టరీ జోష్‌తో ఈ మ్యాచ్‌ బరిలో దిగుతుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై మార్పు చేసింది. మాట్ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ని జట్టులోకి తీసుకుంది. పంజాబ్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతుంది.

తుది జట్లు:

సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.

పిబికెఎస్: ప్రబ్‌సిమ్రన్ సింగ్(కీపర్), కూపర్ కోన్లీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వాదీరా, మార్కస్ స్టోయినస్, మార్కో యాన్సన్, జేవియర్ బ్రాట్‌లెట్, విజయ్ కుమార్ వైశ్యక్, అర్ష్‌దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.