
వాషింగ్టన్ ః అమెరికా సేనలు నిర్ణీత లక్షాన్ని పూర్తి చేస్తాయని , ఈ క్రమంలో ఇప్పటి యుద్ధంలో సత్వర, నిర్ణయాత్మక , అత్యద్భుత విజయాలు సాధిస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం , నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దశలో అమెరికన్లను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. తమ ఆపరేషన్‌కు సంబందించి అత్యంత కీలక ఘట్టాలు దాదాపుగా సంపూర్తి దశకు చేరాయని తమ అత్యంత ప్రాధాన్యతాక్రమపు (ప్రైమ్‌టైమ్) ప్రసంగంలో తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో లక్షాలను ఛేదించడం జరిగింది.
ఈ విషయంలో గణనీయ ప్రగతి సాధించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌కు చెందిన క్షిపణి ఉత్పత్తి సామర్థం దెబ్బతీశామని, నౌకదళాన్ని దిగ్బంధం చేశామని వివరించారు. ఇకపై ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం సంతరించుకోబోదనే నమ్మకం తమకు కుదిరిందన్నారు. ఇరాన్ పరోక్ష సాయుధ శక్తులు ఇకపై ఆయా ప్రాంతాలలో అస్థిరతలకు పాల్పడే అవకాశం లేదన్నారు. మధ్యప్రాచ్యం చమురు మనకు అవసరం లేదు. వారి వద్ద ఉన్నవి ఏవీ కూడాఅమెరికాకు అవసరం లేదు. నిజానికి మిడిలిస్టు వ్యవహారాలకు అమెరికాకు సంబంధం లేదు. అయితే ఈ ప్రాంతానికి సహకరించేందుకు అమెరికా ముందు నిలుస్తుందని ట్రంప్ చెప్పారు.
అమెరికాలో ఇంధన కొరత ఛాన్సే లేదు
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆదిపత్యం, నౌకలకు బ్రేక్‌తో అమెరికాలో చమురు , గ్యాస్ ధరలు పెరుగుతాయనే భయాందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికన్లకు దండిగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. సొంతంగా ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకునే సామర్థం ఉందని తెలిపారు. తాము చేపట్టిన డ్రిల్ బేబీ డ్రిల్ చర్యలతో దేశీయ చమురు ఉత్వత్తి గణనీయంగా పెరిగిందని, చమురు వెలికితీతను ప్రస్తావించారు.సౌదీ, రష్యాల కోటా కలిపితే ఎంత ఉత్పత్తి అవుతుందో అంతకు మించి అమెరికా చమురు దిగుబడి ఉందని అమెరికన్లకు భరోసా ధోరణితో తెలిపారు. మనకు హర్మూజ్ దారి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మార్గం కోరుకునే వారు దీనిని లాక్కోవల్సి ఉంటుంది. దీనిని విలసిల్లేలా చేయాలని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లోని క్రాస్‌హాల్ నుంచి ట్రంప్ ప్రసంగం సాగింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత టీవీ, మీడియా సంస్థలు వెలువరించాయి. దేశ నాయకులు అంతమొందారని తెలిపారు. ఇరాన్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతోందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికన్లు ఓపిక పట్టాలి
ఇరాన్ అమెరికా మధ్య చిరకాల ఉద్రిక్తతలు ఉన్నాయని, ఇప్పటి ఘట్టం కొంతలో కొంత మార్పుతో పాతదే అన్నారు. మిడ్‌టర్మ్ ఎన్నికల దశలో అమెరికా ఓటర్లు మరికొంత ఓపిక పట్టాలని ట్రంప్ పరోక్షంగా కోరారు. ఇంతకు ముందటి ఘర్షణల గురించి ప్రస్తావించారు.. మొదటి ప్రపంచ యుద్ధం ఏడాదిపై ఏడు నెలల ఐదురోజులు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం ఏకంగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పాతిక రోజులు సాగింది. కొరియా, వియత్నాం, ఇరాక్ వార్‌ల గురించి తెలిసిందే. వియత్నాం యుద్ధంలో అమెరికా దాదాపుగా 20 సంవత్సరాలు కట్టుబాటుతో మగ్గాల్సి వచ్చింది.