Reading Time: < 1 minute

ఏ పార్టీలోకి వెళ్లేది వారంలో చెబుతా: జీవన్ రెడ్డి

Caption of Image.

ఏ పార్టీలో చేరేది వారంలో చెబుతానన్నారు మాజీమంత్రి జీవన్ రెడ్డి. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఏప్రిల్ 3న  జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో మార్పు రావాలి కేసీఆర్ పోవాలనే ఆలోచన రావడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది కానీ ఇప్పుడు రెండేళ్లలోనే మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, పునరుద్ధరించకపోవడం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు.  తక్షణమే ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు జీవన్ రెడ్డి. 

గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినా.. తర్వాత అమలు చేయలేదన్నారు.  కారణం ఏదైనా తన సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

►ALSO READ | బీఆర్ఎస్ హయాంలో మన జిల్లా నిధులు..వేరే జిల్లాలకు తరలించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఏప్రిల్ 13న బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి.?

ఏప్రిల్ 6న అమెరికా నుంచి రాగానే జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు  కేటీఆర్ .  13వ తేదీన బీఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది  ఆరోజు మంచి బలమైన ముహూర్తం ఉండటంతో 13 వ తేదీన చేరాలని నిర్ణయించినట్లు సమాచారం.  జీవన్ రెడ్డి చేరిక అనంతరం జగిత్యాల వేదికగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీకి ప్లాన్ చేస్తుంది.   ప్లీనరీ నిర్వహిస్తే జీవన్ రెడ్డి  ప్రత్యేక ఆకర్షణ కానున్నారని బీఆర్ఎస్ భావిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.