Reading Time: 2 minutes
పోసాని మేనల్లుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అని తెలుసా? చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్‌లతో సినిమాలు

పోసాని కృష్ణమురళి.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా పలు విభాగాల్లో సత్తా చాటారాయన. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన ఆపరేషన్ ధుర్యోధన వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెంటల్ కృష్ణ వంటి సినిమాల్లో హీరోగానూ నటించిన ఆయన ఎన్నో వందలాది సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా, కమెడియన్ గానూ మెప్పించారు. అయితే సినిమాల్లో బిజీ బిజీగా ఉండగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పోసాని. మాజీ సీఎం వైఎస్ జగన్ ను అభిమానించే ఆయన గత వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గానూ పని చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి దగ్గర పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. పోసాని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

కాగా మాస్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొర‌టాల శివ‌ పోసానికి దగ్గరి బంధువు అవుతాడు. శివ పోసానికి స్వ‌యాన మేనల్లుడు అవుతాడు. కొర‌టాల‌ను పోసాని కృష్ణ ముర‌ళి ఎత్తుకుని పెంచార‌ట‌. ఈ విష‌యాన్ని పోసాని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో బయటపెట్టారు. అంతే కాదు, తన పెళ్లి చూపులకు కొరటాలను తీసుకెళ్లానని అతను సూచించిన అమ్మాయినే తాను పెళ్లి చేసుకున్నట్టు కూడా చెప్పారు.

కాగా కొరటాల శివ ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. ఆతర్వాత 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత మ‌హేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్, దేవర, చిరంజీవి, రామ్ చరణ్ లతో ఆచార్య వంటి మాస్ సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ దేవర 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Posani Krishna Murali, Kora

sani Krishna Murali, Koratala Siva

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.