
హైదరాబాద్: ఓయో రూములో పెళ్లి దుస్తులు ధరించి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోేలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన లోకేష్(29) అనే యువకుడు హైదరాబాద్ లోని గండిమైసమ్మ ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ పెళ్లి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆర్యసమాజ్ లేదా గుడిలో పెళ్లి చేసుకుందామని ప్రేమజంట నిర్ణయించుకుంది. శుక్రవారం కెపిహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో రూమ్ లో ఇద్దరు తీసుకున్నారు. తాను పెళ్లి బట్టల్లో ఉన్నానని భోజనం తీసుకురావాలని ప్రియురాలికి లోకేష్ చెప్పాడు. యువతి వచ్చి ఎన్ని సార్లు పిలిచినా తలుపు తీయకపోవడంతో, ఓయో సిబ్బంది సహాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యువకుడు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.