
తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయట తిరిగే వారు గొడుగు, టోపీ లేదా నెత్తిపై తడి గుడ్డ కట్టుకోవడం శ్రేయస్కరమని అధికారులు తెలిపారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!