Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్ర వేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్న ట్లు నిపుణులు పేర్కొన్నారు. జెఇఇ మెయిన్ తు ది విడత పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 8వ తేదీ వరకు జరగను న్న ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా దాదాపు 11.23 లక్షల మంది రాయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. గురువారం జరిగిన పరీక్షలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ప్రశ్నలు కొంత సులువుగా రాగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా,మ్యాథ్స్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా ఉన్నట్లు పలువురు విద్యార్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఫిజిక్స్‌లో ముఖ్యమైన చాప్టర్ల నుంచే ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. ఎలక్ట్రోమాగ్నెటిజమ్ చాప్టర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. ఆప్టిక్స్, వేవ్స్ నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారని,

మెకానిక్స్ విభాగం నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ.. పేపర్ మధ్యస్థంగానే ఉందని తెలిపారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రశ్నలు కొంత కఠినంగానే ఉందని, ఆర్గానిక్, ఇనార్గానిక్ మధ్య దాదాపు సమానంగా ప్రశ్నలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలకు కాలిక్యులేషన్స్ చేయాల్సి రావడం, అందుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్‌పై కొంత ప్రభావం పడిందని చెబుతున్నారు. మ్యాథ్స్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకొనేలా ఉందని తెలిపారు. ఈ విభాగంలో జాగ్రత్తగా కాలిక్యులేషన్స్ చేయాల్సినవి, టైం మేనేజ్‌మెంట్ అత్యంత కీలకంగా మారిందని తెలిపారు.