
అమరావతి, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పాలీసెట్) 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. పాలిసెట్‌కు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రేపటిలోపు (ఏప్రిల్ 4వ తేదీ) ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
ఏపీ పాలిసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తుకు అర్హులు. ఈ ఏడాది మార్చి/ ఏప్రిల్ 2026లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు కూడా శనివారం (ఏప్రిల్ 4, 2026) ముగింపు సమయంలోగా ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్ధులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవచ్చు. ఇక మే 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పాలీసెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ పాలిసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.