
- 1,275 కేసులు నమోదు చేశాం: సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమ ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగంపై సివిల్ సప్లై ఆఫీసర్లు దృష్టి సారించారు. మార్చి 12 నుంచి శుక్రవారం వరకు (23 రోజులు) నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 3,699 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. మరో 70 చిన్న సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.1.10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 1,275 ‘6A’ కేసులు, 216 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
గృహ వినియోగానికి సంబంధించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం, నిల్వ చేసి బ్లాక్ లో విక్రయించడం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలు కొనసాగుతాయని, అక్రమ ఎల్‌పీజీ వ్యాపారంపై రాజీ పడబోమని పేర్కొన్నారు.