Reading Time: 2 minutes
Honor Play 80 Pro Launched With 7000mah Battery Price Specs And Features Are

Honor Play 80 Pro Launched: ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ (Honor) తన ప్లే (Play) సిరీస్‌ లో భాగంగా భారీ బ్యాటరీ కలిగిన Honor Play 80 Pro స్మార్ట్‌ ఫోన్‌ ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ ను తీసుకవచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన ఫీచర్ దీని 7,000mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రెండు నుండి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

హానర్ ప్లే 80 ప్రో ఫోన్ లో 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల వీడియోలు చూడటం లేదా గేమింగ్ ఆడటం చాలా స్మూత్‌ గా ఉంటుంది. దీని బ్రైట్నెస్ 850 నిట్స్ వరకు ఉంటుంది. ఇక మొబైల్ లో మెరుగైన పనితీరు కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6s జెన్ 3 5G చిప్‌సెట్‌ ను అమర్చారు.

ఈ కొత్త మొబైల్ 6GB, 8GB, 12GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. అన్ని మోడల్స్ 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉన్నాయి. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను ఇచ్చారు. ఇది f/1.8 అపెర్చర్‌ తో వస్తుంది. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీయవచ్చు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9 (MagicOS 9) పై రన్ అవుతుంది.

Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం దీనికి IP65 రేటింగ్ ఇచ్చారు. చైనా మార్కెట్లో హానర్ ప్లే 80 ప్రో 6GB + 256GB వేరియంట్ రూ. 22,000 (CNY 1,899) కాగా, 8GB + 256GB వేరియంట్ రూ. 24,000 (CNY 2,099),12GB + 256GB రూ. 26,500 (CNY 2,299)గా నిర్ణయించారు. ఇది అజూర్ స్కై (Azure Sky), బ్లాక్ ఫాంటమ్ నైట్ (Black Phantom Night), వైట్ మూన్‌లైట్ (White Moonlight) వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. త్వరలోనే ఇది ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది.