Reading Time: 2 minutes
రోహిత్, విరాట్ ఫ్యూచర్‌పై యూవీ సంచలన వ్యాఖ్యలు.. గంభీర్, అగార్కర్ ల చెంప చెళ్లుమనింపిచాడుగా..

Yuvraj Singh on Rohit Sharma Virat Kohli future: భారత క్రికెట్‌కు దశాబ్ద కాలంగా ఎనలేని సేవలు అందించిన రోహిత్, విరాట్ వంటి ఆటగాళ్లను కెరీర్ చివరి దశలో చీకట్లో ఉంచడం ఏమాత్రం సమంజసం కాదని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఈ దిగ్గజాలతో ముఖాముఖి కూర్చుని నిజాయితీగా చర్చించాలని కోరారు. భారత క్రికెట్‌లో ఆటగాళ్ల మొహం మీద నిజం చెప్పే సంప్రదాయం లేదని, కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారాలని యువీ స్పష్టం చేశాడు. ఒకవేళ జట్టు యాజమాన్యం యువకుల వైపు మొగ్గు చూపాలనుకుంటే, ఆ విషయాన్ని ముందే చెబితే ఆటగాళ్లు గౌరవంగా తప్పుకుంటారని ఆయన పేర్కొన్నాడు.

ఐపీఎల్ తర్వాతే తేల్చాలి..

ప్రస్తుత ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ చర్చలు జరగాలని యువరాజ్ సూచించాడు. భవిష్యత్తులో తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని విన్నప్పుడు ఆటగాళ్లకు బాధ కలగవచ్చు, కానీ ఏడాది తర్వాత ఆ నిజాయితీని వారే అభినందిస్తారని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవడం అతని సత్తాకు నిదర్శనమని గుర్తు చేశాడు. 2027 నాటికి కూడా విరాట్ ఫిట్‌నెస్, పరుగుల దాహం అతడిని ప్రపంచకప్‌కు తీసుకెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రోహిత్ శర్మ ఫామ్, సవాళ్లు..

మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాపై సిడ్నీలో అద్భుతమైన సెంచరీతో సచిన్ రికార్డును సమం చేసిన రోహిత్, 38 ఏళ్ల వయస్సులో మళ్ళీ అగ్రస్థానానికి చేరాడు. అయితే, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినప్పటికీ, రోహిత్ వంటి ప్రపంచ విజేత కెప్టెన్‌కు తగిన గౌరవం దక్కాలని యువరాజ్ కోరాడు. యశస్వి జైస్వాల్ వంటి యువకులు సిద్ధంగా ఉన్నా, ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలు కేవలం యువతతోనే గెలవలేమని, అనుభవం కూడా తోడవ్వాలని ఆయన హెచ్చరించాడు.

బీసీసీఐ వ్యూహాలు, కీలక సమావేశం..

భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఇప్పటికే అప్రమత్తమైంది. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్‌లను రాయ్‌పూర్ వేదికగా కీలక సమావేశానికి బోర్డు పిలిచింది. సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ గ్యాప్‌ను తొలగించి, 2027 ప్రపంచకప్ కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం. కోహ్లీ, రోహిత్ వంటి అనుభవజ్ఞుల అవసరం జట్టుకు ఎంత ఉందో, వారి స్థానంలో వచ్చే యువకుల సంసిద్ధతను కూడా బోర్డు బేరీజు వేయనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..