
హన్మకొండ వడ్డేపల్లిలో ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఉంటున్న నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో రూ.24 లక్షల నగదు, కొంత బంగారం, రూ.30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ కాగితాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
అలాగే ఖమ్మంలోని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంట్లోనూ ఎసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రూ.42 లక్షల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారని తెలిసి కొందరు ముఖ్యమైన డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఈ అవినీతి డాక్యుమెంట్ రైటర్ల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.