
పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో గల్ఫ్ యుద్ధ ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలు అసాధారణ , విపరీత స్థాయిలో పెంచింది. పెట్రోలు ధరలలో లీటరుకు 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలలో 55 శాతం పెరుగుదలను ప్రకటించింది.గ్లోబల్ చమురు ఇంధన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగే ధరలతో పెట్రోలు ధర లీటరుకు ఇప్పుడు 458.41 పైసలు చేరుతుంది. ఇంతకు ముందు ఇది రూ 327.17 గా ఉంది, ఇప్పుడు పెరిగిన రేటు లీటరుకు రూ 137 .23 పైసలు ఇక హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్‌కు రూ 184.49 పెంచారు. దీనితో ఇంతకు ముందు వరకూ ఉన్న లీటరు 335 ధర ఇప్పుడు లీటరుకు రూ 520 దాటుతుంది. ఇక సామాన్యుడికి అత్యవసరం అయిన కిరోసిన్ ధర లీటర్‌కు రూ 457 దాటింది. ఇది అత్యంత కష్టమైన నిర్ణయం అని,
అయితే ఇప్పటి పరిస్థితుల్లో అనివార్యం అని దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేయిజ్ మాలిక్ తెలిపారు. ఇంధన సంక్షోభంతో బంగ్లాదేశ్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాలు మూసివేయాలని, ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశిస్తూ నిర్ణయాలు వెలువరించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను సాయంత్రం ఆరుగంటలకు మూసివేయాలి. బ్యాంకులను మధ్యాహ్నం మూడు గంటలకు బంద్ చేయాల్సి ఉంటుంది. అక్కడి కొత్త ప్రభుత్వానికి ఇప్పటి గల్ఫ్ యుద్ధం స్థితిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఏ దేశం సాయం తీసుకోవాలనే విషయంపై అధికారిక నిర్ణయాలకు సమయం పడుతోంది. ఈ దిశలోనే భారత్ నుంచి కొంత మేర ఇంధన సాయం తీసుకుంది.