Reading Time: < 1 minute
Pochamma: ఆహాలోకి సరికొత్త వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న పోచమ్మ గ్లింప్స్

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు, టాక్ షోలు అంటూ ఎన్నో రకాలుగా వినోదం అందుతుంది. ఇక కొన్ని ఓటీటీలు రకరకాల జోనర్స్ లో సినిమాలను తెరకెక్కింది ప్రేక్షకులకు అందిస్తున్నాయి. వాటిలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్లు అందించిన ఆహా. ఇప్పుడు పోచమ్మ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

గ్రామ దేవత పోచమ్మ గ్లింప్స్ తో సరికొత్త మిస్టికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు అందించడానికి ఆహ రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇంటెన్స్ మ్యూజిక్ బీజీఎం ఈ గ్లింప్స్ పై ఇన్ స్టంట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డివైన్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన “పోచమ్మ” వెబ్ సిరీస్ ఆడియెన్స్ కు ఒక సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది.ఏప్రిల్ 17 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ గ్లింప్స్ ఆకట్టుకోవడంతో ఈ సిరీస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది. రమేష్ ఇంద్ర, ప్రియా శతమర్షన్, శృతి నాయుడు ఈ సిరీస్ లో నటిస్తుండగా.. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఎల్.వి. ముత్తు గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఆహాలో అస్సలు మిస్ అవ్వకండి.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.