Reading Time: < 1 minute

అమరావతి: జనసేన ఎంఎల్‌ఎ అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళలపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం తెలపడంతో రైల్వేకోడూరులో ఎంఎల్‌ఎ అరవశ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, జనసేన కార్యకర్తలతో ప్రధాని రహదారి పైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అప్పుడే సదరు ఎంఎల్‌ఎ బాధితురాలు, తన లాయర్‌తో కలిసి టోల్‌గేట్ వద్ద పూల దుకాణానికి వచ్చారు. ఎంఎల్‌ఎ అరవ శ్రీదర్, అనుచరులు ఆమెను గమనించి దాడికి పాల్పడ్డారు. నానా హంగామా సృష్టించారు. అక్కడ ఉన్నవారిని భయబ్రాంతులకు గురి చేశారు. నడిరోడ్డుపై బాధితురాలును బూతులు తిట్టడంతో ఆమెను కొట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించిన వాళ్ల చేతిలో లాఠీ తీసుకొని లాయర్, ఆమె సోదరుడు గోపీపై దాడికి పాల్పడ్డారు. ఆమె నడిరోడ్డుపై పరుగులు తీసిన ఆమె వెంటపడి మరి కొట్టారు. స్థానిక జర్నలిస్టులు వీడియో తీస్తుండగా వారిని కూడా బెదిరించారు. ఎంఎల్‌ఎ అరవ శ్రీధర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది.