
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్ లోని తుమ్మిడి కుంట చెరువు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. హైటెక్స్ లో జరుగుతున్న టెక్స్టైల్ సదస్సుకు హాజరై, తిరిగి వస్తూ చెరువు వద్దకు వెళ్లారు. దాని చుట్టూ తిరిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
ఆక్రమణల కారణంగా తుమ్మిడికుంట 14 ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువు పునరుద్ధరణలో భాగంగా ఆక్రమణలను తొలగించి, 28.05 ఎకరాలకు విస్తరించారు. ఈ పనులకు ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది.