
- పార్లమెంట్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ఎవరైనా తన పేరు చెప్పుకుని పంచాయతీలు, సెటిల్ మెంట్ల పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం అలాంటి పైరవీకారులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.