
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) 6 వ తరగతి విద్యార్థులకు కొత్తగా మూడు భాషల విధానాన్ని ప్రవేశ పెడుతోంది. అలాగే 9 వ తరగతి విద్యార్థులకు రెండు అంచెల వ్యవస్థతో మేథమెటిక్స్, సైన్సు 202627 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనుంది. త్రిభాషా సూత్రం ప్రకారం న్యూనేషనల్‌ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి)కింద ఆరోతరగతి విద్యార్థులకు 2026 నుంచే ప్రారంభిస్తారని అధికార వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఈ విధానంలో విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలు, ఒక విదేశీ భాషను (ఇంగ్లీష్‌తోసహా )అభ్యసించాలి. ఇందులో ఇంగ్లీష్‌ను విదేశీ భాషగా పరిగణించి, మిగిలిన రెండు భారతీయ భాషలుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఎన్‌ఇపి ప్రకారం త్రిభాష సూత్రాన్ని ఆర్1,ఆర్2,ఆర్3 దశల వారీగా బోధిస్తారు. 202627కు సంబంధించి ఆరో తరగతికి, 202728లో ఏడో తరగతికి,202829లో ఎనిమిదో తరగతికి, 202930 నాటికి తొమ్మిదో తరగతికి, 203132 నాటికి పదో తరగతికి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని సిబీఎస్‌ఈ నిర్ణయించింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరో తరగతి చదివే వారు మూడు భాషలు చదవాల్సి వస్తుంది. ఇకపై పదో తరగతి వరకు ప్రతిఏటా ఇలాగే ఈ విధానం అమలవుతుంది.ప్రస్తుతం సీబీఎస్‌ఈలో రెండు భాషల విధానమే అమలవుతున్న సంగతి తెలిసిందే. 2020లో వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పు సీబీఎస్‌ఈ తీసుకొచ్చింది.ఈ బహుభాషా విధానం వల్ల భారతీయ భాషలకు ఆదరణ కూడా పెరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం విదేశీ స్కూళ్ల నుంచి ఎవరైతే వస్తారో మూడో భాషగా భారతీయ ప్రాంతీయ భాషలను 8/9 తరగతి వరకు ఎవరైతే చదవలేదో వారికి మినహాయింపు కల్పించారు. వారు హిందీ కానీ లేదా స్కూలు అవకాశం ఇచ్చిన మరే భాషనైనా చదువుకోవలసి ఉంటుంది. వీరంతా ప్రామాణాల ప్రకారం అధ్యయనం చేసి కామన్ 80 మార్కుల మూడు గంటల పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది.