
- జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజుల చెల్లింపుల విషయంలో వచ్చిన హైకోర్టు తీర్పు పేద విద్యార్థులకు గుదిబండలా మారిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ జేఏసీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకువచ్చారని, కానీ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ స్కీమ్‌ను క్రమంగా బలహీనపరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.